డైరెక్ట‌ర్ త‌మ్ముడితో హీరోయిన్ రెండో పెళ్లి?


డైరెక్ట‌ర్ త‌మ్ముడితో హీరోయిన్ రెండో పెళ్లి?
డైరెక్ట‌ర్ త‌మ్ముడితో హీరోయిన్ రెండో పెళ్లి?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ హీరోగా తెర‌పైకొచ్చిన చిత్రం `పంజా`. ప‌వ‌న్‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ఈ సినిమాతో త‌మిళ ద‌ర్శ‌కుడు విష్ణువ‌ర్థ‌న్ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. అయితే ప‌వ‌న్ క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేసిన తీరుకు ప్ర‌శంస‌లు పొందిన ఈ ద‌ర్శ‌కుడు స‌క్సెస్‌ని మాత్రం సొంతం చేసుకోలేక‌పోయాడు. కానీ త‌మిళంలో మాత్రం అజిత్ హీరోగా బిల్లా, ఆరంభం వంటి హిట్‌ల‌ని సొంతం చేసుకున్నారు.

ఆయ‌న త‌మ్ముడు క్రిష్ణ హీరోగా, స‌హాయ న‌టుడిగా త‌మిళంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా అత‌ను వార్త‌ల్లో నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే వివాహం చేసుకున్న క్రిష్ణ తాజాగా ఓ హీరోయిన్‌ని వివాహం చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగులో `టెన్త్ క్లాస్‌` చిత్రంలో న‌టించిన హీరోయిన్ సున‌య‌నతో గ‌త కొంత కాలంగా క్రిష్ణ స‌న్నిహితంగా వుంటున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు వివాహం చేపుకోబోతున్నార‌ని కోలీవుడ్ న్యూస్‌. క్రిష్ణ 2014లో హేమ‌ల‌త అనే యువ‌తిని వివాహం చేసుకున్నాడు. కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో ఇద్ద‌రు విడిపోయారు. గ‌త కొంత కాలంగా ఒంట‌రిగా వుంటున్న క్రిష్ణ హీరోయిన్ సున‌య‌న‌కు ద‌గ్గ‌ర‌య్యాడ‌ని, ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం పెర‌గ‌డంతో త్వ‌ర‌తో ఇద్ద‌రు వివాహం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.