రామ్‌గోపావ్‌వ‌ర్మ‌కు శ్ర‌ద్ధాంజ‌లి ప్ర‌క‌టించారు!


రామ్‌గోపావ్‌వ‌ర్మ‌కు శ్ర‌ద్ధాంజ‌లి ప్ర‌క‌టించారు!
రామ్‌గోపావ్‌వ‌ర్మ‌కు శ్ర‌ద్ధాంజ‌లి ప్ర‌క‌టించారు!

వివాదాల‌కే కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. గ‌త కొంత కాలంగా వివాదం ఎక్క‌డుండే వ‌ర్మ అక్క‌డే తిష్ట‌వేసుకుని కూర్చుంటున్నారు. ముంబై తాజ్ హోట‌ల్‌లో పేళుల్లు దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో ఆ ప్ర‌దేశానికి వెళ్లి సినిమా కోసం ప్ర‌య‌త్నించారు వ‌ర్మ‌. ఈ విష‌యం బ‌య‌టికి పొక్క‌డంతో మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో పెద్ద దుమార‌మే చెల‌రేగింది. ఆ త‌రువాత అక్క‌డ సేక‌రించిన ఆధారాల‌తో `ద అటాక్స్ ఆఫ్ 26/11` చిత్రాన్ని రూపొందించి సంచ‌ల‌నం సృష్టించారు.

అక్క‌డితో ఆగ‌క వ‌రుస వివాదాస్ప‌ద అంశాల‌తో సినిమాలు తీస్తూ కాంట్ర‌వ‌ర్సీల‌తో కాపురం చేస్తున్నారు వ‌ర్మ‌. గ‌త కొంత కాంగా వ‌ర్మ క‌న్ను ఏపీ రాజ‌కీయాల‌పై ప‌డింది. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, స్టార్ హీరో, జ‌న‌సేనా అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ నిత్యం వార్త‌ల్లోనిలుస్తున్న వ‌ర్మ ఆ మ‌ధ్య శ్రీ‌రెడ్డితో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని బూతులు తిట్టించి మ‌రీ వార్త‌ల్లో నిలిచారు. అక్క‌డి నుంచి ప‌వ‌న్‌కు వ‌ర్మ‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.

తాజాగా వ‌ర్మ మ‌రోసారి ప‌వ‌న్‌ని టార్గెట్ చేయ‌డం ఆయ‌న అభిమానుల‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. రామ్‌గోపాల్‌వ‌ర్మ తాజాగా `అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు` చిత్రాన్ని తీసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్‌, కేఏపాల్‌తో పాటు జ‌న‌సేనా అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని బ‌ఫూన్‌లుగా చూపించ‌డం స‌రికొత్త వివాదానికి తెర తీసింది. దీంతో ఆగ్ర‌హించిన కూడూరుపాడుకు చెందిన‌ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అభిమాన‌లు వ‌ర్మకు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తూ ఆంధ్రాలో పోస్ట‌ర్‌ల‌ని ఏర్పాటు చేసి 12న మ‌ర‌ణం, 26న పెద్ద‌ఖ‌ర్మ అంటూ ప్ర‌చారం చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. దీనిపై స్పందించిన వ‌ర్మ ` అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు` న‌వ‌క‌వుకోవ‌డం కోసం చేసిన సినిమా, నాకు సీబీఎన్‌, పీకే, లోకేష్ అంటే చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలి` అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.