పవన్ ఫ్యాన్స్ బిగ్ బాస్ 3 రికార్డును కొట్టేసారుగా

pawan fans trend in twitter last night
pawan fans trend in twitter last night

ఎవరు ఔనన్నా కాదన్నా, బిగ్ బాస్ కు ఉన్న హడావిడి, క్రేజ్ ఉంటూనే ఉంది. రెండో సీజన్ లానే మూడో సీజన్ పై కూడా విమర్శలు వచ్చాయి అయితే టీఆర్పీలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. బిగ్ బాస్ కంటూ ఒక కల్ట్ ఫాలోయింగ్ వచ్చేసింది. తిట్టుకుంటూ కూడా ఈ  చూస్తున్నారు. అదే బిగ్ బాస్ నిర్వాహకులకు వరంగా మారుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా షో ఫైనల్ గా హిట్ అవుతుండడంతో వారు మరింత ఉత్సాహంతో మరో సీజన్ ను మొదలుపెడుతున్నారు. ఇది పక్కన పెడితే మొన్న జరిగిన బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కు #bigboss3grandfinale బాగా ట్రెండ్ అయింది. ఈ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించుకుని నెటిజన్లు అందరూ షో గురించి  డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రేండింగ్ లోకి వచ్చింది. మొత్తంగా బిగ్ బాస్ 3 విజేతగా రాహుల్ నిలిచిన సంగతి తెల్సిందే.

ఇది జరిగిన రెండు రోజులకు ట్విట్టర్ లో మరో హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది. బిగ్ బాస్ హ్యాష్ ట్యాగ్ ను మించి ట్రెండ్ అయిన ఈ హ్యాష్ ట్యాగ్ ఒక ఈవెంట్ కు సంబంధించింది అయితే కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేసిన ఈ హ్యాష్ ట్యాగ్ బిగ్ బాస్ ఫినాలే హ్యాష్ ట్యాగ్ ను మించి హల్చల్ చేసింది. ఆ హ్యాష్ ట్యాగ్ #suitcasevijaysaireddy. ఇప్పటికే అర్ధమైందిగా, ఇది వైసిపి అగ్రనేత విజయ సాయి రెడ్డిని విమర్శిస్తూ ట్రెండ్ చేసినదని. వివరాల్లోకి వెళితే.. విజయ సాయి రెడ్డి.. గతంలో చాలా సార్లు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూవచ్చాడు. అవకాశం దొరికినప్పుడల్లా పవన్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం విజయ్ సాయి రెడ్డికి అలవాటుగా మారింది. బహిరంగ సభల్లో, మీడియా ఇంటర్వ్యూలలోనే కాకుండా విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో సైతం పవన్ పై విమర్శలు చేస్తూ రావడం పవన్ కు అసలు నచ్చలేదు. అందుకే మొన్న ఒక బహిరంగ సభలో అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. సూట్ కేస్ కంపెనీల పేరిట అవినీతి సొమ్మును బొక్కి, జైల్లో గడిపి వచ్చిన విజయ సాయి రెడ్డి తనమీద విమర్శలు చేసే అర్హత లేదంటూ పవన్ దుయ్యబట్టాడు.

ట్విట్టర్ లో ప్రత్యర్థులపై తన హోదాను మర్చిపోయి చీప్ గా విమర్శలు చేసే విజయ సాయి రెడ్డిపై పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుండో గుర్రుగా ఉన్నారు. ఇక ఇప్పుడు పవన్ కూడా తనని విమర్శించడంతో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. #suitcasevijaysaireddy ను ఉపయోగించి వైసిపి అగ్రనేతను ఒక రేంజ్ లో ఏసుకున్నారు. ఈ దెబ్బకు బిగ్ బాస్ హ్యాష్ ట్యాగ్ ను దాటి దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాటితో పాటు కుప్పలుతెప్పలుగా మీమ్స్ కూడా ట్రెండ్ చేసారు. ఈ అభిమానం ఏదో ఓట్ల రూపంలో చూపించి ఉంటే పవన్ కనీసం ఒక్క చోటైనా గెలిచేవాడు కదా అని ప్రత్యర్ధులు ఎదురుదాడికి దిగడం కూడా అయిపోయింది.