బాబు పై ఎటాక్ చేసిన పవన్ కళ్యాణ్Pawan Kalyan attack on TDP on NO Confidence Motion

తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో చంద్రబాబు పై ఎటాక్ చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధించడంలో మీరు ఘోరంగా విఫలమయ్యారని , ఇన్నేళ్ల మీ అనుభవం , పాలనా దక్షత ఏమైందని నేరుగా చంద్రబాబు పై ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ కెక్కాడు పవన్ కళ్యాణ్. ఒకవైపు టిడిపి ఎంపీ లు బీజేపీ ని తప్పుపడుతూనే ప్రధాని మోడీ కాళ్ళు ఎలా మొక్కుతారని ఇదేం రాజనీతి అంటూ తెలుగుదేశం పార్టీని , ఆ నాయకుడు చంద్రబాబు నాయుడి పై దాడి చేస్తున్నాడు పవన్ . ఒకసారి హోదా కావాలని , మరోసారి స్పెషల్ స్టేటస్ తో ఎక్కువే సాధించామని అలాగే ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ కావాలని రకరకాలుగా డిమాండ్లు చేస్తూ మీరు ఎన్ని టర్న్ లు తీసుకున్నారో తెలుసా అంటూ చంద్రబాబు చేసిన రకరకాల ప్రకటన ల క్లిప్ లని పోస్ట్ చేసాడు పవన్ కళ్యాణ్.

 

అసలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి అంత సీన్ లేదని కనీసం ఒక్క సీటు ని కూడా గెల్చుకోలేని బీజేపీ తో అంటకాగింది మీరేనని , అలాంటి పార్టీ తో పొత్తు కోసం నేను వెంపర్లాడటం లేదని ఘాటుగా విమర్శించాడు పవన్ . 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పారీ బీజేపీ తో అలాగే పవన్ జనసేన తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ శత్రువు అయ్యాడు తెలుగుదేశం పార్టీకి . ఇక స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీకి నుండి దూరమయ్యాక తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు జగన్ , పవన్ , బీజేపీ లు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో చంద్రబాబు పై జగన్ , పవన్ లతో పాటుగా బీజేపీ వాళ్ళు మరింతగా ఎదురుదాడి చేస్తున్నారు.

English Title: pawan kalyan attack on tdp on no confidence motion