ఛానల్ ని కొనుక్కున్న పవన్ కళ్యాణ్


pawan kalyan bags 99 channelజనసేన అనే రాజకీయ పార్టీ పెట్టాం కాబట్టి సొంతంగా ఓ ఛానల్ కూడా ఉండాలని డిసైడ్ అయ్యాడు పవన్ అందుకే రకరకాలుగా ప్రయత్నించి ఏదో ఛానల్ కొందామని వెళ్లి ఇంకేదో ఛానల్ కొనుక్కున్నాడు . ఇంతకీ పవన్ కళ్యాణ్ కొనుక్కున్న ఛానల్ ఏదో తెలుసా …… 99 న్యూస్ ఛానల్ . కమ్యూనిస్టుల చేతిలో ఉన్న ఈ ఛానల్ ని తోట చంద్రశేఖర్ అనే వ్యక్తి కొన్నాడు , తోట చంద్రశేఖర్ అనే వ్యక్తి చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు సన్నిహితుడు ప్రజారాజ్యం పార్టీకి సేవలందించాడు . అలాగే ప్రజారాజ్యం పార్టీ తరుపున పార్లమెంట్ కు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు .

కట్ చేస్తే ఇప్పుడు జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు దాంతో పవన్ కళ్యాణ్ కోసం 99 న్యూస్ ఛానల్ ని కొన్నాడు తోట చంద్రశేఖర్ . కొనడమే ఆలస్యం జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి వార్తలతో ఓరెత్తిస్తున్నారు . 2019 లో ఎన్నికలు రానున్నందున రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పుడే రాజకీయ వేడి మొదలయ్యింది . పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పై విరుచుకు పడుతున్నాడు , అయితే భారతీయ జనతా పార్టీ ని కానీ , జగన్ పార్టీ ని కానీ అంతగా విమర్శించడం లేదు ఎందుకో !

English Title: pawan kalyan bags 99 channel