క్రిష్ మూవీలో ప‌వ‌న్ క్యారెక్టర్ పేరిదేనా?

క్రిష్ మూవీలో ప‌వ‌న్ క్యారెక్టర్  పేరిదేనా?
క్రిష్ మూవీలో ప‌వ‌న్ క్యారెక్టర్ పేరిదేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ – క్రిష్‌ల రేర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పిరియాడిక్ ఫిల్మ్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌తో `ఖుషీ`, బంగారం` వంటి హిట్ చిత్రాల్ని అందించిన స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో స‌రికొత్త నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డానికి ముందే ఈ చిత్రం కోసం అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో కీల‌క సెట్‌ల‌ని నిర్మించారు.

వాట‌ర్ ఫాల్స్‌తో పాటు కీల‌క మైన ఓ ఫోర్ట్ సెట్‌ని నిర్మించారు. ఇందులోనే ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించిన క్రిష్ మెరుపు వేగంతో కీల‌క‌మైన రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసిన‌ట్టు తెలిసింది. ఇందులో మొఘ‌ల్ సామ్రాజ్యానికి చెందిన కోహినూర్ వ‌జ్రం కీల‌కంగా వుంటుంద‌ని, దీని చుట్టే క‌థ‌ సాగుతుంద‌ని తెలుస్తోంది. ఉన్న‌వాడిని కొట్టి లేని వాడికి పంచే అభిన‌వ రాబిన్ హుడ్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌పించ‌నున్నార‌ట‌.

బాలీవుడ్ న‌టులు అర్జున్ రాంపాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ని సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజున చిత్ర బృందం ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలిసింది. తాజాగా మ‌రో కీల‌క విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ బందిపోటుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సినిమాలో ప‌వ‌న్ పాత్ర పేరు వీరా అని దాని ఆధారంగానే సినిమా టైటిల్‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తాజా అప్ డేట్‌.