ప‌వ‌న్ సెట్స్‌కి వ‌చ్చేది అప్పుడేనా?

ప‌వ‌న్ సెట్స్‌కి వ‌చ్చేది అప్పుడేనా?
ప‌వ‌న్ సెట్స్‌కి వ‌చ్చేది అప్పుడేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవలి తిరుప‌తిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న త‌రువాత కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. మైల్డ్ సిమ్ట‌మ్స్ మాత్ర‌మే వున్నాయ‌ని కోవిడ్ టెస్ట్ చేయించుకున్న ఆయ‌న పాజిటివ్ అని తేల‌డంతో శంక‌ర్ ప‌ల్లిలోని ఫామ్ హౌస్‌లో ప్ర‌త్యేకంగా గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. క‌రోనా నుంచి కోలుకుంటున్న ఆయ‌న ఎవ‌రితో మాట్లాడ‌టానికి కానీ, స్టేట్‌మెంట్‌లు ఇవ్వ‌డానికి కానీ ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రకటన చేయలేదు.  ప్రస్తుతం ఆయ‌న తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కోవిడ్ నుండి కోలుకున్న ఆయ‌న ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప‌వ‌న్ జూలై వరకు సెట్స్‌కి తిరిగి వచ్చే స్థితి క‌నిపించ‌డం లేడు. పవన్ కళ్యాణ్  న‌టిస్తున్న రెండు చిత్రాలు ప్ర‌స్తుతం సెట్స్‌పై వున్నాయి. అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో మరో చిత్రాన్ని కూడా ప్రారంభించాల్సి ఉంది. కానీ ప‌వ‌న్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు.

తాజా ప‌రిస్థితులని బ‌ట్టి పవన్ కళ్యాణ్ జూలై త‌రువాతే సెట్స్‌లోకి అడుగుపెట్ట‌నున్నార‌ని తాజాగా వినిపిస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడేళ్ల విరామం త‌రువాత న‌టించిన  ‘వకీల్ సాబ్’ గత నెలలో విడుదలైంది. ఈ మూవీ త‌రువాత ప‌వ‌న్  ‘అయ్యప్ప‌నుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో రానాతో క‌లిసి న‌టిస్తున్నారు, ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇటీవలే మొద‌లైంది. ఈ మూవీతో పాటు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న‌ పీరియడ్ డ్రామా ‘హరి హర వీరమల్లు’లోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.