బాలకృష్ణ పై నోరు జారిన పవన్ కళ్యాణ్


Pawan kalyan comments on balakrishna

నందమూరి బాలకృష్ణ పై కామెంట్ చేసి మరింత రాజకీయ వేడి పెంచాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . బాలకృష్ణ ప్రధానమంత్రి అని చూడకుండా నరేంద్ర మోడీ ని అమ్మనా బూతులు తిట్టాడని నేను కూడా అలాగే తిడితే మోడీ ని ఎదురించినట్లా ? అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను , బాలయ్య అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్ . ధర్మపోరాట దీక్ష అని చేస్తూ ఆ వేదిక మీద బాలయ్య దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని తిట్టకూడని తిట్లు తిట్టిన విషయం తెలిసిందే . అయితే అప్పట్లో బాలయ్య తిట్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా భారతీయ జనతా పార్టీ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు అంతేకాదు బాలయ్య మీద దాడికి కూడా ప్రయత్నించారు .

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అప్పటి సంఘటనని గుర్తుకు తెస్తూ బాలయ్య లాగా నేను కూడా మోడీ ని తిడితేనే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినట్లా ? బీజీపీ ని వ్యతిరేకించాలంటే ఆయన్ని బాలయ్య లాగా తిట్టాలా అంటూ నిలదీస్తున్నారు . గతకొంత కాలంగా జనసేన ని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చుడుతున్నాడు . చంద్రబాబు ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని కానీ టిడిపి – కాంగ్రెస్ ల సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడం ఖాయమని అంటున్నాడు . చంద్రబాబు కి వెన్నుపోటు అన్నది వెన్నతో పెట్టిన విద్య అని అది నాకు చేతకాదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు .

English Title: Pawan kalyan comments on balakrishna