రేణు దేశాయ్ కి విషెష్ తెలిపిన పవన్ కళ్యాణ్pawan kalyan comments on renu desai second marriage

మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి కి సిద్దమైన నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు అందజేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ”కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న రేణు గారికి శుభాకాంక్షలు ” అంటూ ట్వీట్ చేసాడు పవన్ కళ్యాణ్ దాంతో షాకింగ్ అవ్వడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వంతు అయ్యింది . కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో రేణు దేశాయ్ కి శుభాకాంక్షలు తెలియజేయడం సంచలనం సృష్టిస్తోంది . అందునా రేణు గారు అంటూ సంబోధించడం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తోంది .

రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి ప్రస్తావించినప్పటి నుండి ఆమెని టార్గెట్ చేసారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . ఇక రెండో పెళ్లి చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసారు , అంతేనా కొంతమంది అయితే రేణు దేశాయ్ ని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ వల్ల పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ పై విమర్శలు చేయడం మానుకుంటారేమో చూడాలి . ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం కుదరదు కానీ రేణు దేశాయ్ ని అదేపనిగా విమర్శిస్తున్న వాళ్లకు పవన్ ఓ సంకేతం అయితే పంపాడు . మరి ఇప్పుడైనా ఆగుతారా ? ఇంకా రేణు దేశాయ్ ని విమర్శిస్తూనే ఉంటారా ? చూడాలి .

English Title: pawan kalyan comments on renu desai second marriage