శ్రీరెడ్డి పై పవన్ కళ్యాణ్ కేసు పెట్టాడు


శ్రీరెడ్డి పై పవన్ కళ్యాణ్ కేసు పెట్టాడునటి శ్రీరెడ్డి గతకొంత కాలంగా తెలుగు సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది సంచలన ఆరోపణలు చేస్తూ . అయితే ఆమె ఆరోపణలపై పవన్ కళ్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు . పవన్ కళ్యాణ్ అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకోవద్దు సుమా ! ఈ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు . శ్రీరెడ్డి ఆరోపణలలో నిజం లేదని ఆమె కేవలం ప్రచారం కోసమే ఇదంతా చేస్తోందని కాబట్టి ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కేసు పెట్టాడు పవన్ కళ్యాణ్ .

ఇప్పటికే దర్శకులు శేఖర్ కమ్ముల శ్రీ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే శేఖర్ కమ్ముల క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినప్పటికీ శ్రీరెడ్డి పై భయపడేది లేదని తిరిగి సమాధానం ఇచ్చింది . గతకొంత కాలంగా శ్రీరెడ్డి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే . మరి ఈ గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి .