పవన్ కళ్యాణ్ కొడుకు కూడా సినిమాల్లోకి


Pawan kalyan ex wife Renu desai about akira nandan entry
Renu desai and akira nandan

మెగా కుటుంబంలో ఇప్పటికే డజన్ల కొద్దీ నటీనటులు ఉన్నారు కాగా ఆ లిస్ట్ లో త్వరలోనే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా జాయిన్ కానున్నాడు . ఇదే విషయాన్ని తాజాగా రేణు దేశాయ్ స్పష్టం చేసింది . అకిరా నందన్ బ్లడ్ లోనే యాక్టింగ్ ఉందని , చిరంజీవి పెదనాన్న , పవన్ కళ్యాణ్ నాన్న అవుతారు కాబట్టి అకిరా లో కూడా అదే రక్తం ప్రవహిస్తోంది కాబట్టి సహజంగానే నటన అకిరా రక్తంలోనే ఉంది కాకపోతే ముందుగా చదువు పూర్తయ్యాకే సినిమాల్లో నటిస్తానంటే పుకుంటాను కానీ చదువు పూర్తిచేయకుండా ఒప్పుకోను అని స్పష్టం చేసింది .

తాజాగా రేణు దేశాయ్ కవిత సంకలనం తో అందరి ద్రుష్టి ఆకర్షిస్తోంది . అందులో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అకిరా నందన్ పై మాట్లాడింది . యుక్త వయసులో ఉన్న అకిరా ఇంకా సినిమాల్లోకి రావాలంటే 5లేదా 6 ఏళ్లకు పైగానే పడుతుంది . ఒకవేళ చదువు ని పక్కన పెట్టి వస్తానంటే కూడా ఏమి చేయలేము . వారసుల రాజ్యం లోకి పవన్ కళ్యాణ్ కొడుకు కూడా రావడానికి సిద్ధం అవుతున్నాడు . అయితే యాక్టింగ్ లో ఎదో ఒక స్పెషాలిటీ చూపిస్తేనే ఆదరిస్తారు లేదంటే ……. !

 

English Title: Pawan kalyan ex wife Renu desai about akira nandan entry