టీడీపీ కి టివి9 కు ఉన్న బంధాన్ని బయటపెట్టిన పవన్


Pawan Kalyan exposes nexus between TV9  and TDPఅధికార తెలుగుదేశం పార్టీ కి టివి 9 కు మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాడు పవన్ కళ్యాణ్ . తాజాగా ఆ ఇద్దరి కి ఉన్న బంధాన్ని చాటి చెప్పేలా ఓ రుజువు ని సైతం ట్వీట్ చేసి వేడిని పెంచాడు పవన్ . 2009 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కి టివి 9 అధినేత శ్రీనిరాజు ఏకంగా కోటి రూపాయల విరాళం ఇచ్చాడు . దానికి సంబందించిన రుజువు లను బయట పెట్టి సోషల్ మీడియాలో పెట్టాడు పవన్ .

అధికార తెలుగుదేశం పార్టీ తో టివి 9 కున్న అనుబంధానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది పవన్ వైఖరి . తెలుగుదేశం పార్టీ కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు కాబట్టే వాళ్లకు కోటి రూపాయల విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నాడు పవన్ . తనపై సదరు ఛానల్ చేస్తున్న కుట్ర లో తెలుగుదేశం పార్టీ హస్తం ఉన్నట్లు నమ్మడానికి ఇంతకంటే రుజువు కావాలా ? అని పవన్ ప్రశ్నిస్తున్నాడు . మొత్తానికి పవన్ రాజకీయ రంగ ప్రవేశం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద దుమారమే చెలరేగుతుంది .