కంటి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్


pawan kalyan eye surgery completed జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు . గతకొంతకాలంగా కంటి సమస్య తో బాధపడుతున్నాడు పవన్ అయితే ఇన్నాళ్లు ఆ సమస్య తీరుతుందని అనుకున్నాడో ఏమో కానీ మూడు నెలల తర్వాత కూడా తీవ్రత ఎక్కువ కావడంతో మొన్న హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు . ఒకరోజంతా ఆసుపత్రిలోనే ఉన్న పవన్ నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళాడు .

పవన్ కళ్యాణ్ ఎడమ కంటి లో కురుపు ఉండటంతో ఇన్నాళ్లు ఇబ్బంది పడ్డాడు పవన్ అయితే ఆ కురుపు ని శస్త్ర చికిత్స చేసి తొలగించారు దాంతో డిశ్చార్జ్ అయ్యాడు పవన్ . రంగస్థలం సక్సెస్ మీట్ లోనే కంటి సమస్యతో బాధపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయం తెలిసిందే . అప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్ నల్ల కళ్ళద్దాలతో బయటకు వస్తున్నాడు . ఇటీవలే పోరాట యాత్ర లు కూడా చేసాడు పవన్ అయితే కంటి సమస్య అధికమవడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు .

2019 ఎన్నికల కోసం జనసేన ని సమాయత్తం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ . అయితే కంటి ఆపరేషన్ నేపథ్యంలో కొద్దిరోజులు పవన్ కళ్యాణ్ ఇంటి పట్టునే ఉండనున్నాడు .

English Title: pawan kalyan eye surgery completed