సీఎం కుర్చీ కావాలని ఆశపడుతున్న పవన్


pawan kalyan eyes on chief minister chair

సీఎం కుర్చీలో కూర్చోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశపడుతున్నాడు అందుకే జనాన్ని ఓట్లు అడుగుతున్నాడు …… మీరు గట్టిగా అరిస్తే సరిపోదని అలా ఎవరూ ముఖ్యమంత్రి కారని ఓట్లు వేస్తేనే నేను సీఎం అవుతానని తన మనసులోని మాట బయట పెట్టేసాడు పవన్ . సినిమాలను పక్కన పెట్టేసి జనసేన పార్టీ ని బలోపేతం చేయడానికి నడుం బిగించాడు పవన్ అందులో భాగంగా జిల్లా పర్యటనలు మొదలు పెట్టాడు . ఎన్నికలు ఇంకా సంవత్సర కాలం కూడా లేనందున ఈలోపు సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ని చుట్టేయ్యాలని భావిస్తున్నాడు జనసేన అధినేత .

గత ఎన్నికల సందర్బంగా ఆంధప్రదేశ్ కు అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందని భావించానని అందుకే చంద్రబాబు కు మద్దతు ఇచ్చానని , జనసేన పోటీ చేయలేదని ఒకరు సీట్లు ఇస్తే తీసుకోవడం ఏంటి ? మేమే ఇస్తాం ఇతరులే తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉందని నేరుగా చంద్రబాబు ని టార్గెట్ చేసాడు పవన్ . అంతేకాదు నేరుగా చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టాడు . ప్రజల్లో కి పవన్ కళ్యాణ్ వెళ్తున్న సందర్బంగా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు అరుస్తుండటంతో ఇన్నాళ్లు అధికారం వద్దు అంటూ వచ్చిన పవన్ తాజాగా మీరు అరిస్తే నేను ముఖ్యమంత్రి ని కాలేను కాబట్టి ఓట్లు వేయండి అప్పుడే ముఖ్యమంత్రి అవుతాను అంటూ అసలు విషయాన్నీ చెప్పేసాడు పవన్ కళ్యాణ్ . మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ కు పట్టం కడతారా చూడాలి .