చేసిన తప్పుకు ఫీలవుతున్న పవన్ ఫ్యాన్స్


చేసిన తప్పుకు ఫీలవుతున్న పవన్ ఫ్యాన్స్
చేసిన తప్పుకు ఫీలవుతున్న పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎప్పుడూ లేనంత దూకుడుగా సినిమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. రీ ఎంట్రీ లో పింక్ రీమేక్ షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టేసిన పవన్ కళ్యాణ్, మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. పింక్ రీమేక్ షూటింగ్ నడుస్తుండగానే క్రిష్ తో ప్రాజెక్ట్ ను సెట్ చేసిన సంగతి తెల్సిందే. ఇటీవలే లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లో మొదలుకానుంది. 19వ శతాబ్ధాపు కాలపు సెటప్ లో నడిచే ఈ కథలో పవన్ బందిపోటు పాత్రలో నటించనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా పవన్ కెరీర్ లో 26వ సినిమా. పింక్ రీమేక్ ను మే లో విడుదల చేయనున్న పవన్, క్రిష్ ప్రాజెక్ట్ ను వచ్చే సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ రెండే కాకుండా పవన్ కళ్యాణ్ తన 28వ ప్రాజెక్ట్ ను సెట్ చేసేసాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ పట్ల పవన్ ఫ్యాన్స్ అమితమైన ఆనందంలో ఉన్నారు. దానికి కారణం గబ్బర్ సింగ్. పవన్ కు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న హిట్ ను గబ్బర్ సింగ్ రూపంలో అందించాడు హరీష్ శంకర్. పవన్ ను తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు హరీష్. ఒక అభిమాని సినిమాను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే చేసాడు. అయితే కొన్ని కారణాల వల్ల హరీష్ శంకర్ ను డీజే సమయంలో ట్రోల్ చేసారు పవన్ అభిమానులు. దానికి ప్రతిగా హరీష్ శంకర్ వాళ్ళను బ్లాక్ చేయాల్సి వచ్చింది. అయితే చేసిన తప్పుకు ఇప్పుడు పవన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. హరీష్ శంకర్ కు సారీ చెబుతూ తమను అన్ బ్లాక్ చేయమని కోరుతున్నారు. అసలు పవన్ రీ ఎంట్రీకి హరీష్ శంకర్ సినిమా అయితే పెర్ఫెక్ట్ అని కూడా కామెంట్లు పెడుతున్నారు.