సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలైందిగా!


సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలైందిగా!
సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలైందిగా!

ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఏ హీరో పుట్టినరోజు వచ్చినా బయట భారీగా చేయలేరు. అందుకే సందడంతా సోషల్ మీడియాలోనే. ఇదివరకు కూడా సోషల్ మీడియాలో హీరోల పుట్టినరోజులకు ట్రెండ్స్ అంటూ హడావిడి ఉంటోన్నా, ఇప్పుడు దాని పాపులారిటీ మరింత పెరిగింది. ఏ హీరో పుట్టినరోజు వచ్చినా వారి ఫ్యాన్స్ చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటోంది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నాడు వారి అభిమానులు ఏ రేంజ్ లో రచ్చ చేసారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 24 గంటల్లో దాదాపు 60 మిలియన్ ట్వీట్లతో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. 24 గంటల్లో కేవలం 18 గంటల్లోనే ఈ ఫీట్ ను సాధించడం విశేషం. అయితే ఈ వరల్డ్ రికార్డ్ సాధించి ఎక్కువ రోజులు గడవకముందే దానికి ఎసరు పడేలా ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సీడీపీ గురించే చర్చ సాగుతోంది. ఏ స్టార్ పుట్టినరోజుకైనా ఇప్పుడు సీడీపీ విడుదల చేయడం అనేది పరిపాటి. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు కూడా ఒక సీడీపీ విడుదల చేసారు. ఈ సందర్భంగా ట్రెండ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు దాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లారు. ఇప్పటికే 1 నుండి 30 మిలియన్ వరకూ ఫాస్టెస్ట్ ట్వీట్స్ వేసిన రికార్డ్ ను సాధించారు. ఇక ఇప్పుడు మహేష్ అభిమానుల రికార్డ్ పై కన్నేశారు. చూడాలి మరి అది ఎంతవరకూ జరుగుతుందో.