ఘోర విషాదం : పవన్ ఫ్యాన్స్ షాక్ తో మృతి


pawan kalyan fans died with current shock in visakhapatnamతమ అభిమాన కథానాయకుడు వస్తున్నాడన్న సంతోషంలో భారీ ఎత్తున స్వాగతం పలకాలని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్లెక్సీ లను కడుతూ కరెంట్ షాక్ తో తిరిగిరాని లోకాలకు వెళ్లారు . అత్యంత విషాదకరమైన ఈ సంఘటన విశాఖపట్టణం లోని పాయకరావుపేటలో జరిగింది . జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ప్రజలతో మమేకం అవుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే శ్రీకాకుళం లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసాడు .

ఇక ఆ పర్యటనలో భాగంగా విశాఖపట్టణం లోని పాయకరావు పేట కు వస్తుండటంతో 30 అడుగుల ఫ్లెక్సీ లను ఏర్పాటు చేసారు అభిమానులు నాగరాజు , శివలు . అయితే ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో నాగరాజు తో పాటు శివ అక్కడికక్కడే చనిపోయారు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది . అభిమాన నటుడు వస్తున్నాడన్న సంతోషం ఎక్కువసేపు లేకుండా పోయింది . తుని , పాయకరావుపేట లకు చెందిన ఇద్దరు అభిమానులు చనిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి .