రేణు దేశాయ్ ని చంపేస్తానంటున్న పవన్ ఫ్యాన్స్


Pawan Kalyan fans issue kill threats to renu desai

రేణు దేశాయ్ కనుక రెండో పెళ్లి చేసుకుంటే చంపేయడం ఖాయమని సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు దాంతో రేణు దేశాయ్ భయపడుతోంది . ఇటీవలే తన రెండో పెళ్లి విషయం గురించి సోషల్ మీడియాలో పంచుకోవడమే కాకుండా ఎంగేజ్ మెంట్ గురించి కూడా పోస్ట్ చేసింది రేణు దేశాయ్ . అయితే రేణు రెండో పెళ్లి గురించి చెప్పడమే ఆలస్యం ఆమె ని అభినందించే వాళ్ళ కంటే బెదిరించే వాళ్లే ఎక్కువయ్యారు .

ఇక పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరేమో ఏకంగా రేణు దేశాయ్ ని చంపేస్తానని హెచ్చరికలు జారీ చేసాడు . దాంతో రేణు దేశాయ్ భయపడుతోంది . ఇక అదే సోషల్ మీడియాలో పెళ్లి చేసుకొని పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు తీసుకురావద్దని వేడుకుంటున్నారు కూడా . పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ లకు ఇద్దరు పిల్లలు కాగా ఆ ఇద్దరు కూడా రేణు దేశాయ్ వద్ద పూణే లోనే ఉంటున్నారు . పవన్ నుండి విడిపోయిన తర్వాత ఇన్నాళ్లకు రెండో పెళ్లి పై ఆలోచన మళ్లింది రేణు దేశాయ్ కు కానీ పవన్ ఫ్యాన్స్ నుండి బెదిరింపులు వస్తున్నాయి పాపం .

English Title: Pawan Kalyan fans issue kill threats to renu desai