అడ్డంగా బుక్కైన అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్‌!

అడ్డంగా బుక్కైన అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్‌!
అడ్డంగా బుక్కైన అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్‌!

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏదైనా కామెంట్ చేయాల‌న్నా వంద సార్లు ఆలోచిస్తుంటారు సెల‌బ్రిటీస్‌. కానీ కొంత మంది మాత్రం ఎలాంటి ఆలోచ‌న లేకుండా తాము ఫీలైంది ట్వీట్ చేసి ఆ త‌రువాత ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. వివ‌రాల్లోకి వెళితే..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెర‌కెక్కిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఏప్రిల్ 9న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. శ్రీ‌రామ్ వేణు దర్శ‌క‌త్వంలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీని ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్ వీడియోని రిలీజ్ చేశారు.

తాజాగా ఈ మూవీని చూసిన హీరోయిన్ మినీ రివ్యూని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. `నిన్న రాత్రి అమెజాన్ ప్రైమ్ వీడియోలో `వ‌కీల్‌సాబ్‌` చూశాను. ఒక విష‌యం త‌ప్ప‌కుండా చెప్పాలి. ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లు ఈ మూవీలో వున్న బ‌ల‌మైన సందేశాన్ని క‌నిపించ‌కుండా చేశాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌దైన న‌ట‌న‌తో హ‌ద్దుల్ని చెరిపేశారు. ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య నాగల్ల అలాగే ప్ర‌కాష్‌రాజ్ స‌ర్ లేక‌పోతే ఈ సినిమా ప‌రిపూర్ణం అయ్యేది కాదు`అని ట్వీట్ చేసింది.

అంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్టార్ డ‌మ్ కార‌ణంగా ఈ సినిమా ద్వారా అందించాల‌నుకున్న బ‌ల‌మైన సందేశం ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని డైరెక్ట్‌గానే అనుప‌మ ట్వీట్ చేయ‌డం ప‌వ‌న్ అభిమానుల్ని ఆగ్ర‌హానికి గురిచేసింది. దీంతో ఆమెని ఫ్యాన్స్ టార్గెట్ చేసి ట్రోల్ చేయడం మొద‌లుపెట్టారు. దీంతో జ‌రిగిన త‌ప్పుని తెలుసుకున్న అనుప‌మ వెంటనే త‌ను చేసిన త‌ప్పుకి సారీ చెప్పేసింది. `సారీ గైస్ ఇప్పుడే రియ‌లైజ్ అయ్యాను. ప‌వ‌న్‌కల్యాణ్‌గారంటే గౌర‌వం, ప్రేమ వున్నాయి` అని ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఇది సో@ల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.