చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్


pawan kalyan fire on chandrababu naiduఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . చంద్రబాబు హోదా విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నాడని అలాగే ఈరోజు అఖిల పక్ష సమావేశమని నిన్న సాయంత్రం చెప్పడం ఏంటి ? అయినా ఈ సమావేశానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నాడు పవన్ కళ్యాణ్ . విజయవాడ లో సమావేశం ఏర్పాటు చేసారు కానీ ఒక్క రోజు ముందు మాత్రమే సమాచారం ఇవ్వడం ఏంటని అందుకే మేము ఆ సమావేశానికి వెళ్లడం లేదని స్పష్టం చేసాడు పవన్ కళ్యాణ్ .

 

చంద్రబాబు కు నిజంగా హోదా గురించి పోరాటం చేయాలనిపిస్తే ఇక్కడ కాదు ఢిల్లీ కి వెళ్లి తమిళ రైతుల మాదిరిగా పోరాడాలని చంద్రబాబు కి హితువు పలికాడు పవన్ కళ్యాణ్ . చంద్రబాబు నేరుగా ధర్నా కు దిగాలని అప్పుడే సంక్షోభం నెలకొంటుందని పవన్ సలహా ఇస్తున్నాడు . అయితే పవన్ మాట చంద్రబాబు వింటాడా ?