ఫ‌స్ట్ `వకీల్ సాబ్‌` ఆ త‌రువాతే మ‌రేదైనా..

ఫ‌స్ట్ `వ‌కీల్ సాబ్‌` ఆ త‌రువాతే మ‌రేదైనా..
ఫ‌స్ట్ `వ‌కీల్ సాబ్‌` ఆ త‌రువాతే మ‌రేదైనా..

రెండేళ్ల విరామం త‌రువాత కెమెరా ముందుకొచ్చారు ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. `పింక్‌` రీమేక్‌తో మ‌ళ్లీ సినిమాల్లో నటించ‌డం మొద‌లుపెట్టారు. `వ‌కీల్ సాబ్‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ , లిరిక‌ల్ వీడియో సినిమా ఏ స్థాయిలో వుండ‌బోతోందో స్ప‌ష్టం చేసింది.

సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని ముందు ప్లాన్ చేశారు.  దానికి త‌గ్గ‌ట్టే షూటింగ్ చ‌క‌చ‌కా జ‌రిగిపోతూ వుంది. కీల‌క కోర్టు డ్రామాకు సంబంధించిన సీన్‌ల‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌త్యేకంగా వేసిన కోర్టు హాల్ సెట్‌లో పూర్తి చేశారు. కానీ కీల‌క ఘ‌ట్టాల‌న్నీ అలాగే వుండిపోయాయి. ఇక‌పై వాటిని పూర్తి చేయాల‌నుకుంటున్న వేళ క‌రోనా కార‌ణంగా షెడ్యూల్ ఆగిపోయింది. దీంతో సినిమా రిలీజ్ టైమ్ కూడా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ చిత్రాన్ని ప‌వ‌న్ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ త‌రువాత నుంచి క్రిష్ చిత్రానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ డేట్స్ కేటాయించాల్సింది. అయితే `వ‌కీల్‌సాబ్‌` చిత్రాన్ని దృష్టిలో పెట్టుకున్న ప‌వ‌న్ ముందు ఈ చిత్రాన్ని పూర్తి చేసిన త‌రువాతే క్రిష్ చిత్రానికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. దీంతో లాక్‌డౌన్ త‌రువాత కూడా `వ‌కీల్‌సాబ్‌` షూటింగ్‌లోనే పాల్గొంటార‌ని తెలిసింది.