పవన్ & హరీష్ సినిమా కథ ఏంటి.?


పవన్ & హరీష్ సినిమా కథ ఏంటి.?
పవన్ & హరీష్ సినిమా కథ ఏంటి.?

సరిగ్గా 10 ఏళ్ళ క్రితం “కొమరం పులి” సినిమా ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ తో ఉండాలని ఆలాంటి కథలు వింటున్న సమయంలో పవన్ డేట్స్ తో ప్రొడ్యూసర్ అయిన బండ్ల గణేష్ ఒక డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కి వచ్చాడు. అతను చెప్తున్న కథ విని పవన్ హ్యాపీగా నవ్వుతూనే ఉన్నాడు. లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి, సినిమా టైటిల్ ఏంటి.? అని అడిగితే అతను “రొమాంటిక్ రిషి” అని చెప్పాడు. పవన్ సూపర్ అని మిగిలిన కథ రెడీ చెయ్యమని వెళ్ళిపోయాడు.ఆ తరువాత కొన్ని కారణాల వల్ల పవన్ ఆ సినిమా చెయ్యలేదు. “లవ్ ఆజ్ కల్” సినిమా రిమేక్ చేసి మరోసారి దెబ్బ తిన్నాడు. ఆ డైరెక్టర్ మాత్రం ఆ కథలో ఇంకొంచెం కామెడీ యాడ్ చేసి “మిరపకాయ్” అని సినిమాగా తీసి హిట్ కొట్టాడు. ఆ డైరెక్టర్ హరీష్ శంకర్.

ఆ తరువాత పవన్ అతన్ని పిలిచి, గబ్బర్ సింగ్ సినిమా ప్రాజెక్ట్ ఇచ్చాడు. అసలు సిసలు పవన్ ఫ్యాన్ అయిన హరీష్ ఆ సినిమాను ఒక బ్లాక్ బస్టర్ లా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ పవన్ – హరీష్ ఇంకొక సినిమా చెయ్యబోతున్నారు. అయితే ఇది రీమేక్ కథ.? లేక హరీష్ – పవన్ సొంత కథ .? అన్న క్లారిటీ రాలేదు. ఇప్పటికే “జిగార్తాండ” అనే రీమేక్ సినిమాతో హిట్ కొట్టిన హరీష్ కు ఈసారి కూడా పవన్ ఒక రీమేక్ ప్రాజెక్ట్ అప్పగించే సూచనలు ఉన్నాయి. ఇక కథ ఏదైనా హరీష్ ట్రీట్మెంట్ కి పవన్ మ్యాజిక్ కలిస్తే మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం గ్యారంటీ.