డౌట్ లేదు.. హరీష్ శంకర్ సినిమా ముందుకే..


డౌట్ లేదు.. హరీష్ శంకర్ సినిమా ముందుకే..
డౌట్ లేదు.. హరీష్ శంకర్ సినిమా ముందుకే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో భాగంగా ఏకంగా మూడు సినిమాలను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ మూడింట్లో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న కాంబో మాత్రం హరీష్ శంకర్ తో పవన్ చేయనున్న సినిమానే. హరీష్ శంకర్ అంటే కమర్షియల్ సినిమాకు పెట్టింది పేరు, పైగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో మనందరికీ తెల్సిందే. అందుకే అభిమానులు మళ్ళీ ఈ కాంబో రావాలని కోరుకున్నారు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరిగాక వారి ఆనందానికి అవధుల్లేవు. దీనికి మరో కారణం, పవన్ చేస్తోన్న మరో రెండు సినిమాల్లో కమర్షియల్ అంశాలకు పెద్ద పీట ఉండబోదు.

వకీల్ సాబ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం. క్రిష్ తో చేయనున్న సినిమా పీరియాడిక్ డ్రామా. ఇందులో కూడా హీరోయిజం పాళ్ళు ఉన్నా దర్శకుడు క్రిష్ కాబట్టి కంటెంట్ మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. అయితే హరీష్ శంకర్ చిత్రాన్ని ఈ మూడింట్లో ఆఖరున పెట్టాడు పవన్. కాకపొతే ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా అది ముందుకు జరగడం దాదాపు ఖాయమైంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ తారాగణంతో సినిమా చేయడం అంత సమంజసం కాదు. పైగా క్రిష్ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో సాగే ప్యాన్ ఇండియా చిత్రం. ఇందులో యుద్ధాలు వంటి వాటికి కూడా ఆస్కారం ఉంది. వందలాది మంది కావాలి. అందుకే హీరో, దర్శకుడు, నిర్మాత చర్చించుకుని ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. వకీల్ సాబ్ అవ్వగానే పవన్ హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టేస్తాడు.