పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా పరిస్థితి ఏంటి?

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ సినిమా పరిస్థితి ఏంటి?
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా పరిస్థితి ఏంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధించింది అన్నది మనం చూసాం. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది అన్నప్పుడు అందరూ ఉత్సాహంగా ఎదురుచూసారు. అంతా నార్మల్ గా ఉండి ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలై ఉండేది. కానీ కరోనా ఈ ప్లాన్స్ పై నీళ్లు చల్లింది.

ఆగస్ట్ నుండి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే పవన్ మొదటి ప్రయారిటీ మాత్రం సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రం. ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. ఈ చిత్రంతో పాటు హరిహర వీర మల్లు షూటింగ్ కూడా పూర్తి చేయాలి.

ఈ లెక్కన చూసుకుంటే ఈ ఏడాది హరీష్ శంకర్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ మొదలుపెట్టే అవకాశాలు అయితే లేవు.