పవన్ – హరీష్ శంకర్ మూవీ వచ్చేది పెద్ద పండక్కేనా?


పవన్ - హరీష్ శంకర్ మూవీ వచ్చేది పెద్ద పండక్కేనా?
పవన్ – హరీష్ శంకర్ మూవీ వచ్చేది పెద్ద పండక్కేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తోన్న విషయం తెల్సిందే. ఈ హీరో వకీల్ సాబ్ ను ఓ కొలిక్కి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం కోర్ట్ రూమ్ సీన్స్ షూటింగ్ జరుగుతుండగా మార్చ్ నెలాఖరుతో షూటింగ్ మొత్తం పూర్తైపోతుందని సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లాయర్ గా కనిపించనున్న విషయం తెల్సిందే. నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా కాకుండా పవర్ స్టార్ క్రిష్ చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు. అయితే కొద్ది రోజులు షూటింగ్ చేసిన తర్వాత బ్రేక్ ఇచ్చి వకీల్ సాబ్ షూటింగ్ ను చేస్తున్నాడు. ఏప్రిల్ నుండి క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇది పీరియాడిక్ చిత్రమైనా కానీ పవన్ నటించే పోర్షన్స్ వరకూ ముందు కంప్లీట్ చేయబోతున్నారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడంలో స్పీడ్ ప్రదర్శిస్తున్నాడు.

క్రిష్ మూవీతో పాటు ఇప్పటికే ప్రకటించిన హరీష్ శంకర్ మూవీను కూడా పవన్ మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. సమ్మర్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ముందు ఈ మూడు సినిమాలనూ ఇదే ఏడాది విడుదల చేయాలని భావించారు కానీ దానివల్ల ఏదైనా పొలిటికల్ కారణాల వల్ల షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో సంక్రాంతి 2021కి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ మూవీని దించాలని భావిస్తున్నారు. జనవరి 8న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతున్నా మరో సినిమా సంక్రాంతికి వచ్చే స్కోప్ ఉంది కనుక ఒక వారం గ్యాప్ ఇచ్చి 14 లేదా 15 తారీఖుల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై మరింత క్లారిటీ త్వరలో రానుంది.