ఎన్టీఆర్ నో చెప్పిన కథతో పవన్ – హరీష్ సినిమా?


ఎన్టీఆర్ నో చెప్పిన కథతో పవన్ - హరీష్ సినిమా?
ఎన్టీఆర్ నో చెప్పిన కథతో పవన్ – హరీష్ సినిమా?

ఇండస్ట్రీలో ఒకరి కథలు ఒకరి దగ్గరకు వెళ్లడం చాలా సాధారణంగా జరిగేదే. ఒకరు రిజెక్ట్ చేసిన కథను మరొకరు చేసి సూపర్ హిట్ కొట్టడం, సూపర్ ప్లాప్ అందుకోవడం జరుగుతూ ఉంటాయి. ఏ కథ ఎవరి దగ్గరకు చేరాలని ఉంటుందో అలాగే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకెన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్టోరీతో పవన్ సినిమా చేస్తున్నాడన్న పుకారు బాగా షికారు చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో జోరుగా సినిమాలను యాక్సప్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ముందుగా వకీల్ సాబ్ ను చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో విరుపాక్షను మొదలుపెట్టాడు. ఈ రెండిటి తర్వాత హరీష్ శంకర్ తో సినిమా ఉంటుందని అధికారికంగా వెల్లడైంది కూడా. హరీష్ శంకర్ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను మరోసారి అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ చిత్రం ఉంటుందని, అంతకంటే ఏం చెప్పలేనని అన్నాడు.

అయితే పవన్ కు వినిపించిన కథ ఒకప్పుడు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసినదని అంటున్నారు. ఎన్టీఆర్ తో హరీష్ శంకర్ రామయ్య వస్తావయ్యా సినిమా చేసిన విషయం తెల్సిందే. ఈ కథ కంటే ముందు హరీష్, ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పగా అది నచ్చలేదు. దాని ప్లేస్ లో రామయ్య వస్తావయ్యా చేసారు. ఇప్పుడు ఆ రిజక్ట్ చేసిన కథకు మార్పులు చేర్పులు చేసి పవన్ కు వినిపించగా అది పవన్ కు తెగ నచ్చేసింది. ఇంతకీ ఇందులో నిజమెంత ఉందో?