పవన్ కళ్యాణ్ స్పెషల్ డేన ట్రిపుల్ ధమాకా?


pawan kalyan harish shankar movie update on september 2nd

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మళ్ళీ రీఎంట్రీను గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేసేలా ఒక పక్కా ప్లానింగ్ తో వచ్చాడు. అయితే కరోనా పవన్ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రణాళికలు పూర్తిగా తారుమారు చేసేసింది. పరిస్థితులు మాములుగా ఉండి ఉంటే ఈపాటికి వకీల్ సాబ్ విడుదలైపోయేది. క్రిష్ తో సినిమా సగం షూటింగ్ పూర్తయ్యేది. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా 30 రోజులపాటు చేయాల్సి ఉంది. అది పూర్తయ్యాక క్రిష్ సినిమా తిరిగి మొదలుపెట్టాల్సి ఉంది. ఇక కేవలం కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ జరిగింది.

ఇక ఈ రెండూ కాకుండా హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని నిర్ణయించుకున్న సంగతి కూడా తెల్సిందే. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అంటే సెప్టెంబర్ 2న ఈ సినిమా విశేషాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఒక అప్డేట్ ఉంటుందని చెప్పారు.

పవన్ అభిమానులు అది తమ హీరో సినిమా కోసమే అంటూ ఆశపడుతున్నారు. హరీష్ శంకర్ తో పవన్ చేయబోయే సినిమా టైటిల్ తో పాటు ఒక పోస్టర్ ను కూడా వదుల్తారని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ గా పూజ హెగ్డే పేరుని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా పవన్ పుట్టినరోజు నాడు మొత్తం మూడు అప్డేట్స్ ఉండనున్నాయన్నమాట.