పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందట


pawan kalyan has life threat from tdp సినిమాలను వదిలేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అధికార తెలుగుదేశం పార్టీ నుండి ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేసాడు అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు . ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి మీడియాకు కోట్లాది రూపాయలు ఇచ్చారని , తెరవెనుక నుండి లోకేష్ ఇదంతా చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు శ్రీనివాసరావు .

గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రకరకాల కథనాలు మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే . పైగా కొన్ని మీడియా సంస్థలు అయితే పవన్ పై చర్చలు పెట్టాయి దాంతో పవన్ కూడా వాటిని టార్గెట్ చేసిన విషయం కూడా విదితమే ! పవన్ కళ్యాణ్ కు ప్రజల మద్దతు ఉందని , మా సహాయ సహకారాలు అందిస్తామని ,పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరగరానిది జరిగితే దానికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరికలు జారీ చేసారు కాపునాడు నాయకులు .