పవన్ కళ్యాణ్ కు గాయం


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతికి గాయం అయ్యింది , అంతేకాదు వడదెబ్బ కూడా కొట్టింది దాంతో నిన్న రాత్రి గుంటూరు లో జరగాల్సిన రోడ్ షోని వాయిదా వేసుకున్నాడు . నిన్న విజయనగరం లో ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి ముందుకు వస్తున్న క్రమంలో హఠాత్తుగా వచ్చిన ఓ వ్యక్తి పవన్ కాళ్ళను గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడ్డాడు . ఆ సమయంలో చేతికి గాయం అయ్యింది .

అయితే అక్కడ ప్రసంగాన్ని ఎలాగోలా పూర్తిచేసి విజయవాడ చేరుకున్న పవన్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు . వడదెబ్బ తాలూకు ప్రభావం కూడా ఉంది కాబట్టి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చారట దాంతో గుంటూరు రోడ్ షో రద్దు చేసుకున్నాడు .

చేతికి కూడా గాయం అయినందున ప్రచారానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు మిత్రులు కానీ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని వృథా చేయొద్దు అని భావిస్తున్నాడు పవన్ . అయితే ఈరోజు ఉగాది కాబట్టి ఈ ఒక్క రోజు ప్రచారానికి గ్యాప్ ఇస్తాడేమో చూడలి .