క్రిష్ సినిమాకు టైటిల్ కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్

క్రిష్ సినిమాకు టైటిల్ కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్
క్రిష్ సినిమాకు టైటిల్ కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. అందులో మొదటిది క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న పీరియాడిక్ జానపద చిత్రం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రపు దొంగల ముఠాకు హెడ్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. మొఘల్ సామ్రాజ్యపు కాలంలో ఈ సినిమా సెటప్ ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసేసారట. గత కొంత కాలం నుండి ఈ సినిమా టైటిల్ విషయంలో బోలెడన్ని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో విరూపాక్ష టైటిల్ కన్ఫర్మ్ అనుకున్నారు. ఈ మధ్య కాలంలో వీరమల్లు, హర హర మహాదేవ్ టైటిల్స్ అంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సూటబుల్ టైటిల్ ను కన్ఫర్మ్ చేసాడట. సినిమా కథకు సరిపోయేలా హరి హర వీరమల్లు టైటిల్ ను లాక్ చేయమని సూచించినట్లు తెలుస్తోంది. టీమ్ కు కూడా ఈ టైటిల్ బాగా నచ్చిందట. టైటిల్ లాక్ అవ్వడంతో ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేయడానికి సిద్ధమవుతున్నారట.