సుప్రీం హీరో పై క్లాప్ కొట్టిన పవర్ స్టార్


సుప్రీం హీరో పై క్లాప్ కొట్టిన పవర్ స్టార్
సుప్రీం హీరో పై క్లాప్ కొట్టిన పవర్ స్టార్

“నాకు తెలిసి ఈ ప్రపంచంలో మూడే జాతులున్నాయి. తినే దాని కన్నా ఎక్కువ పండించేవాడు; కనీసం తినే మాత్రం పండించేవాడు ;ఈ రెండూ చేయలేక అడుక్కుతినే వాడు.. కానీ ఈ ముగ్గురిని దోచుకు తినే ఇంకో జాతి ఒకటి ఉంది లోఫర్ జాతి. మనమంతా అధికారాన్ని ఆల్ లోఫర్ గాళ్ళ చేతిలో పెట్టి ఏడుస్తున్నాం.”

ఇలాంటి డైలాగ్స్ సుప్రీం హీరో సాయి తేజ్ చెప్తే ఎలా ఉంటుంది.? థియేటర్ లో మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ వచ్చేస్తుంది. సుప్రీమ్ హీరో సాయి తేజ్ కథానాయకుడిగా , “అల వైకుంఠపురం బ్యూటీ” నివేద పేతురాజ్ హీరోయిన్ గా డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. ఈ సినిమాకు స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నారు. ఈ సినిమాను ప్రభాస్ తో “రెబల్”, గోపీచంద్ తో “గౌతమ్ నంద” సినిమాలు తీసిన నిర్మాతలు జె.భగవాన్ మరియు పుల్లారావు గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

“స్వరబ్రహ్మ” మణి శర్మ గారు ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇక “డైనమైట్” సినిమా తర్వాత తెలుగులో దేవకట్టా గారు సినిమా చేయలేదు. తనకు ఎంతగానో పేరు తీసుకు వచ్చిన “ప్రస్థానం” సినిమాను హిందీలో అదే పేరుతో సంజయ్ దత్ గారితో రీమేక్ చేశారు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అదేవిధంగా సోనీ పిక్చర్స్ వారు సమర్పించిన ఒక పెద్ద పౌరాణిక సిరీస్ ను కూడా దేవకట్టా డైరెక్షన్ చేశారు.

దేవకట్టా అంటే మనకు గుర్తొచ్చేది ఆయన స్క్రిప్టులో ఉండేటువంటి ఇంటెన్సిటీ ముఖ్యంగా డైలాగ్స్. “ప్రస్థానం”, “ఆటోనగర్ సూర్య” సినిమాలలో హీరో డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇక అలాంటి పెద్ద పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ కు సాయి లాంటి హీరో కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఒక గొప్ప సినిమాను ఆశించవచ్చు. ఇక ఈ వేడుకకు ప్రత్యేకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరు కావడం పట్ల ఇప్పటికే సోషల్ మీడియాలో “పవన్ కళ్యాణ్ గారు దేవకట్టా తో సినిమా చేస్తారు…” అన్న ఫ్యాన్ థియరీ లు కూడా మొదలయ్యాయి.

Credit: Twitter