కరోనా వైరస్ పై స్పందించిన పవన్ కళ్యాణ్


కరోనా వైరస్ పై స్పందించిన పవన్ కళ్యాణ్
కరోనా వైరస్ పై స్పందించిన పవన్ కళ్యాణ్

కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో తన పార్టీ జనసేన ఆవిర్భావ సభను నిరాడంబరంగా నిర్వహించిన పార్టీ అధ్యక్షుడు మరియు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులు మరియు తన అభిమానులను ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేశారు. కరోనా వైరస్ అనేది ఏదైనా ఒక ప్రదేశంలో ప్రవేశించిన ఒకటి లేదా రెండు వారాల తర్వాత తీవ్ర రూపం దాలుస్తుందన్న శాస్త్రవేత్తల మరియు నిపుణుల అభిప్రాయాన్ని పవన్ మరొకసారి బలపరిచారు.రాబోయే రెండు మూడు వారాల పాటు ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని.. సంబంధిత విషయం పట్ల 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సరైన సూచనలు చేయాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర స్థితి ని ప్రకటించి ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఐసోలేషన్ వార్డులు, స్క్రీనింగ్ సెంటర్లను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని, ఇంకా వాటి సంఖ్యను పెంచాలని సూచించారు. ఇక సామాజిక మాధ్యమాల వేదికల పై పుకార్లు వ్యాపింప చేయకుండా చర్యలు తీసుకోవాలని.. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు, ఆర్గనైజేషన్స్ ప్రస్తుత ఈ పరిస్థితిని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని… తన అభిమానులకు ఇప్పటికే కరోనా వైరస్ పట్ల అవగాహన పెంపొందించే మరియు ఇతర ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రణాళిక ఇచ్చామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

Credit: Twitter