పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 30 కోట్లు ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రెడీ అవుతున్నాడా ? అంటే అవుననే వినిపిస్తోంది ఫిలిం నగర్ సర్కిల్లో . జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు 5 నుండి 6 సీట్లు వస్తే గొప్ప అన్నట్లుగా నివేదికలు రావడంతో ఇక ఇప్పట్లో రాజకీయాల గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవడమే అని భావిస్తున్నాడట అందుకే ఎన్నికల ఫలితాలు రాగానే సినిమాలపై ఒక నిర్ణయం తీసుకోకునున్నాడట పవన్ కళ్యాణ్ .

మే 23 న ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో ఆ తర్వాత సినిమాలపై ద్రుష్టి పెట్టనున్నాడట పవన్ . మైత్రి మూవీ మేకర్స్ ముందుగానే కర్చీఫ్ వేసి పెట్టింది అంతేకాదు 30 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందట కూడా . ఇప్పటికే మైత్రి అడ్వాన్స్ పవన్ దగ్గర ఉంది , ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ తుది నిర్ణయం తీసుకోనున్నాడు . మొత్తానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం అయితే ఖాయమైపోయింది .