పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందలేదా ?


Pawan Kalyan
Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే . అయితే ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు దాంతో పవన్ కళ్యాణ్ కావాలనే హాజరు కాలేదా ? లేక పవన్ కు గవర్నర్ నుండి ఆహ్వానం అందలేదా ? అన్న చర్చ సాగుతోంది .

గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకి రాజకీయ ప్రముఖులతో పాటుగా అధికారులు ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు అందుతాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు . ఇంతకుముందు హైదరాబాద్ లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా హాజరయ్యేవాడు కానీ ఏపీలో జరిగిన మొదటి విందుకి హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయ్యింది .