పవన్ అన్నను ఫాలో అవ్వట్లేదు రీట్వీట్ కొట్టాడు


పవన్ అన్నను ఫాలో అవ్వట్లేదు రీట్వీట్ కొట్టాడు
పవన్ అన్నను ఫాలో అవ్వట్లేదు రీట్వీట్ కొట్టాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి నుండి మెగా ఫ్యామిలీకి కొంచెం దూరంగానే ఉంటూ వచ్చాడు. ఫ్యామిలీ గాథేరింగ్స్ కు కానీ ఫంక్షన్స్ కు కానీ అటెండ్ కాకపోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా నెమ్మదిగా దీనికి అలవాటు పడిపోయారు. అయితే అలా అని మెగా ఫ్యామిలీకి నిజంగా దూరంగా ఏం లేడు పవన్. మధ్యమధ్యలో వాళ్ళను కలుస్తూనే ఉన్నాడు. ఇటీవలే తన అన్న చిరంజీవిపై తనకెంత అనుబంధం ఉందో కూడా మాటల్లో చెప్పాడు. అలాగే  తన అన్న కొడుకంటే పవన్ కు ప్రేమ కొంచెం ఎక్కువే. రామ్ చరణ్ తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు పవన్.

ఈ నేపథ్యంలో ఇటీవలే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. చిరంజీవికిది ఫస్ట్ టైమ్ కాగా రామ్ చరణ్ ఇదివరకు ట్విట్టర్ వాడినా కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఇద్దరూ ట్విట్టర్ లోకి రావడం మెగా ఫ్యాన్స్ కు పండగే. అయితే నిన్న రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ చేసిన డొనేషన్ ను ఫాలో అవుతూ తాను కూడా 70 లక్షలు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ స్పందించాడు కూడా. అంతే కాదు రామ్ చరణ్ ను ఫాలో అవుతున్నాడు. మెగా హీరోల్లో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ లను మాత్రమే ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్.

ఇక చిరంజీవి ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్న విషయం తెల్సిందే. చిరు ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా మంది హీరో, హీరోయిన్స్ స్వాగతం పలికారు. వారికి అదిరిపోయే రేంజ్ లో పంచ్ లు ఇచ్చాడు మెగాస్టార్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి స్వాగతం పలకలేదు. చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ట్వీట్ కు మాత్రం రీట్వీట్ కొట్టాడు. రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న పవన్ చిరును మాత్రం ఫాలో అవ్వట్లేదు.