జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా ఊహించని విధంగా టిడిపి ని టార్గెట్ చేయడం వెనుక బిజెపి ఆడిస్తున్న నాటకమని , అందుకు కారణం ఇటీవల పవన్ కళ్యాణ్ ఇల్లు , ఆఫీస్ లపై జరిగిన దాడుల సమయంలో పవన్ కళ్యాణ్ గుట్టు రట్టు చేసే కొన్ని వీడియో లు దొరకడమే కారణమని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి . ఇవన్నీ మీడియాలో అంతగా రావడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వస్తున్నాయి . పవన్ గుట్టు కేంద్రం చేతిలో ఉండటంతో జనసేన అధినేత కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారాడని ఆరోపణలు వస్తున్నాయి . దానికి ఊతమిచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉండటం తో దీనికి మరింత బలం చేకూరింది .