ప‌వ‌న్ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందా?


ప‌వ‌న్ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందా?
ప‌వ‌న్ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి` త‌రువాత క్రియాశీల రాజ‌కీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏపీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన తరుపున గాజువాక‌, భీమ‌వ‌రంల‌లో పోటీ ప‌డిన ప‌వ‌న్ రెండు చోట్లా రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల కార‌ణంగా ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. ఆ త‌రువాత నుంచి కూడా ఏపీ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తూ వ‌స్తున్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ కెమెరా ముందుకు రావాల‌ని ఫిక్స్ అయిన విష‌యం తెలిసిందే.

బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్నఓ భారీ చిత్రానికి ప‌వ‌న్ ఇటీవ‌ల గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రీ‌రామ్ వేణు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప‌వ‌న్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారు. క‌మ‌ర్షియ‌ల్ అంశాల మేళ‌వింపుతో కొత్త పంథాలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేశారు.

ఈ సోమ‌వారం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో గెడ్డంతో క‌నిపిస్తున్న ప‌వ‌న్ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సినిమా టైటిల్‌ `లాయ‌ర్ సాబ్‌`అని క్యాప్ష‌న్‌గా `స‌త్య‌మేవ జ‌య‌తే` అనే హిందీ అక్ష‌రాలు క‌నిపించేలా పెట్టార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. దీంతో ఇదే టైటిల్ ఫైన‌ల్ చేసే అవ‌కాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.