పవన్ మళ్ళీ త్రివిక్రమ్ సినిమాతోనే బ్రేక్ ఇస్తాడా?


పవన్ మళ్ళీ త్రివిక్రమ్ సినిమాతోనే బ్రేక్ ఇస్తాడా?
పవన్ మళ్ళీ త్రివిక్రమ్ సినిమాతోనే బ్రేక్ ఇస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో 25వ సినిమా తనకు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన సంగతి తెల్సిందే. అజ్ఞాతవాసి రిజల్ట్ అనుకున్నట్లుగా రాలేదు కానీ పవన్ దాంతోనే సినిమాలకు కామా పెట్టాడు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూనే తన స్పీడ్ ను చూపించాడు. ఒక సినిమాకు మూడు ఒప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తోన్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ సగానికి పైగా పూర్తైన సంగతి తెల్సిందే. మార్చ్ నెలాఖరుకల్లా పవన్ కళ్యాణ్ పోర్షన్ వరకూ పూర్తి చేస్తారు. ఏప్రిల్ లో మిగతా షూటింగ్ ను కూడా పూర్తి చేసి మే నెలలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. వకీల్ సాబ్ ను పవన్ పూర్తి చేయగానే క్రిష్ సినిమాను మొదలుపెడతాడు. ఆ చిత్రం పూర్తవుతుండగానే పవన్ ఒప్పుకున్న మరో సినిమా – హరీష్ శంకర్ దర్శకత్వంలోనిది పట్టాలెక్కుతుంది. క్రిష్ సినిమాను ఈ ఏడాది చివరకు పూర్తి చేసి హరీష్ శంకర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కల్లా పూర్తి చేయాలని ఇప్పటికే ప్రణాళికలు పూర్తి చేసారు. దాంతో పవన్ నటించే మూడు సినిమాలు పూర్తవుతాయి. ఇవి తన కెరీర్ లో 26, 27, 28వ చిత్రాలు.

తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ 29, 30 చిత్రాలపట్ల కూడా ఒక ఐడియాకు వచ్చినట్లు తెలుస్తోంది. 29వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తాడట. ఈ రెండూ 2022 సమ్మర్ కు పూర్తయితే ఆ తర్వాత నుండి మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు.