బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్


pawan kalyan sensational comments on balakrishna

నందమూరి బాలకృష్ణ తుపాకీ తీసి కాల్పులు జరిపితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ మా అభిమానులు బైక్ ల సైలెన్సర్ లను తీసి నడిపిస్తుంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . 2004 లో బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అలాగే సత్యనారాయణ చౌదరి పై కాల్పులు జరిపిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . కాగా ఆ కేసులో బాలయ్య పోలీస్ స్టేషన్ కు అలాగే కోర్టు మెట్లు ఎక్కాడు కట్ చేస్తే బాలయ్య మా పై కాల్పులు జరపలేదని సాక్ష్యం ఇచ్చారు బెల్లంకొండ సురేష్ , సత్యనారాయణ చౌదరి లు .

కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ సంఘటన ని గుర్తుకు తెస్తున్నాడు పవన్ కళ్యాణ్ . అయితే బాలయ్య పేరు నేరుగా చెప్పలేదు కానీ నా అభిమానులు సైలెన్సర్ తీసి వాహనాలు నడిపితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు కానీ తుపాకీతో కాల్పులు జరిపిన వాళ్ళని మాత్రం వదిలేశారని , వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పరోక్షంగా బాలయ్య కాల్పుల ఉదంతాన్ని తెరపైకి తెచ్చాడు పవన్ . గతకొంత కాలంగా తెలుగుదేశం పార్టీ ని విమర్శిస్తున్న పవన్ తాజాగా బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపాడు ఇక బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల .

English Title: pawan kalyan sensational comments on balakrishna