జగన్ మగతనం పై సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్


Pawan kalyan sensational comments on jagan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు . ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అసెంబ్లీ కి వెళ్లకుండా బయట పాదయాత్రలు చేసుకుంటున్నాడని , అసెంబ్లీ కి వెళ్లి ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే అప్పుడు నీ మగతనం ఏంటో తెలుస్తుంది అంతేకాని ఇలా పాదయాత్రలు చేస్తే కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు . ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన నువ్వు ప్రశ్నించడం లేదు నేను ఆ పని చేస్తుంటే నాపై విమర్శలు చేస్తావా ? అంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ . మీరే కాదు జగన్ మీ పార్టీ ఎం ఎల్ ఏ లు కూడా ప్రజా సమస్యలపై పోరాడటం లేదు , భూ కబ్జా లు చేసుకుంటూ పోతున్నారు కానీ ప్రజా సమస్యలపై గళం ఎత్తుతొంది మేమె అంటూ జగన్ పార్టీ ఎం ఎల్ ఏ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు పవన్ .

జగన్ పైన అలాగే జగన్ పార్టీ ఎం ఎల్ ఏ లపైన పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది . జగన్ ని పట్టుకొని నీ మగతనం ఏంటి ? అని ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది . 2019 మేలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ కి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది . దాంతో పోటీపడి విమర్శలు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు కాగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాన్ని బాగానే వంట బట్టించుకున్నాడు .

English Title: Pawan kalyan sensational comments on jagan