శ్రీరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్


pawan kalyan sensational comments on srireddyవివాదాస్పద నటి శ్రీరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసి ఆమె వ్యవహారాన్ని తప్పు పట్టాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఈరోజు హైదరాబాద్ లోని నెక్ లెస్ రోడ్ జనసేన ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్ . ఆ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ శ్రీరెడ్డి విషయం పై స్పందించాడు . శ్రీరెడ్డి కి జరిగింది అన్యాయమే అయితే దానికి ఆమె ఎంచుకున్న పద్దతి సరైంది కాదని అన్నాడు .

 

ఫిలిం ఛాంబర్ ముందు అర్ద నగ్న ప్రదర్శన చేయడం , మీడియా ఛానల్ లలో గంటల తరబడి , రోజుల తరబడి కూర్చోవడం వల్ల , ఫోటోలను లీక్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటని ? పోలీసులను ఆశ్రయించడం ద్వారా న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది కానీ ఇలా గోల చేయడం ద్వారా లాభం లేదని తేల్చి చెప్పాడు . మీడియా నుండి రకరకాల ప్రశ్నలు ఎదురు కావడంతో మరో అంశాన్ని ఎత్తుకున్నాడు పవన్ . అయితే ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం పవన్ కళ్యాణ్ కు తెలుసట .