ఆత్మహత్య చేసుకుందామనుకున్నా : పవన్ కళ్యాణ్


Pawan Kalyan
Pawan Kalyan

నేను ఇంటర్ లో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా , అన్నయ్య దగ్గర లైసెన్స్డ్ పిస్టల్ ఉంది దాంతో కాల్చుకోవాలనుకున్నా దాంతో ఇంట్లో వాళ్ళు భయపడి అన్నయ్య ముందుకు తీసుకెళ్లారు అప్పడు అన్నయ ఇచ్చిన ఓదార్పు తోనే నేను బ్రతికి ఉన్నాను అందుకే నాకు అన్నయ్య అంటే స్ఫూర్తి అని సంచలన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే నాకు చాలా బాధేసిందని విచారం వ్యక్తం చేసాడు . ప్రభుత్వం కంటే పిల్లల తల్లిదండ్రులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని హితువు పలికాడు .

మెగా అభిమానుల సమక్షంలో నిన్న రాత్రి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి . కాగా ఆ వేడుకలలో మెగా హీరోలతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు . తనకు అన్నయ్య చిరు అంటే చాలా ఇష్టమని , అయితే అన్నయ్య తో సైరా నరసింహారెడ్డి సినిమాని నిర్మిస్తున్న రాంచరణ్ నాకంటే గొప్పవాడని అన్నయ్య చిరు , అబ్బాయ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే మెగా అభిమానులు ఈలలతో , గోల చేస్తూ సందడి చేసారు .