ఏదైనా వ్యాక్సిన్ వ‌చ్చాకే షూటింగ్‌ – ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ఏదైనా వ్యాక్సిన్ వ‌చ్చాకే షూటింగ్‌ - ప‌వ‌న్‌క‌ల్యాణ్‌
ఏదైనా వ్యాక్సిన్ వ‌చ్చాకే షూటింగ్‌ – ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ముందుగా ఆయ‌న బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా కార‌ణంగా షూటింగ్‌ని నిర‌విధికంగా ఆపేశారు.

దీనితో పాటు ప‌వ‌న్ మ‌రో చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పిరియాడిక్ చిత్రంగా కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఏ.ఎం. ర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సైలెంట్‌గా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్‌ని కూడా నిలిపివేశారు. ఈ రెండు చిత్రాల‌తో పాటు నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన సోష‌ల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు కీల‌క విష‌యాల్ని వెల్ల‌డించారు.

`క‌రోనా వ‌ల్ల చేస్తున్న సినిమాలు ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలియ‌దు. సామాజిక దూరం పాటిచాలి. తొంద‌ర‌ప‌డి షూటింగ్‌లు చేస్తే క‌ష్ట‌మే. ఆ మ‌ధ్య‌న కొంత మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కేసీఆర్ గారిని క‌లిశారు. షూటింగ్‌లకు అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ చేసే ప‌రిస్థితులు లేవు. ఎవ‌రికైనా క‌రోనా సోకితే.. ఉదాహ‌ర‌ణ‌కు మొన్న అమితాబ్ బ‌చ్చ‌న్ గారికి వ‌చ్చింది. కీల‌క న‌టుల‌కు వ‌చ్చినా ఎవ‌రికి వ‌చ్చినా ఇబ్బందే.. వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు నిస్స‌హాయ‌త‌తో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే` అన్నారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.