ప‌వ‌ర్‌స్టార్ చేస్తున్న వ్ర‌త‌మేంటీ?


ప‌వ‌ర్‌స్టార్ చేస్తున్న వ్ర‌త‌మేంటీ?
ప‌వ‌ర్‌స్టార్ చేస్తున్న వ్ర‌త‌మేంటీ?

ఏదైనా అనుకున్న‌ది నెర‌వేరాలంటే చాలా మంది వ్ర‌తాలు, యాగాలు, హోమాలు చేస్తుంటారు. వాటి ద్వారా స‌త్ఫ‌లితాల్సి పొందుతుంటారు. గ‌తంలో య‌ర్ర‌వ‌ల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చండీ యాగం చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఈ యాగం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాశం అయింది. ఇదిలా వుంటే స్టార్ హీరో, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త‌గా ఓ వ్ర‌తాన్ని త‌ల‌పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఈ వ్ర‌తం పేరు చ‌తుర్మ‌స్య వ్ర‌తం. నాలుగు నెల‌ల పాటు ఈ వ్ర‌త నియ‌మాల్ని, వ్ర‌తాన్ని ఆచరించాల్సి వుంటుంద‌ట‌. ఇటీవ‌ల ఈ నెల 1న తొలి ఏకాద‌శి సంద‌ర్భంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ వ్రతాన్ని మొద‌లుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. నాలుగు నెల‌ల పాటు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫాస్టింగ్ వుంటున్న‌ట్టు చెబుతున్నారు.

గ‌త ఏడాది కూడా ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ ఈ వ్ర‌తాన్ని ప్రారంభించి నాలుగు నెల‌ల పాటు ఆచ‌రించార‌ట‌. క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు తొల‌గి మంచి వాతావ‌ర‌ణం ఏర్ప‌డాల‌ని ప‌వ‌న్ ఈ దీక్ష‌కు పూనుకున్న‌ట్టు చెబుతున్నారు. ఈ నాలుగు నెల‌ల కాలంలో ఉప‌వాస‌న దీక్ష చేస్తూ శాఖ‌హారం మాత్ర‌మే తీసుకోవాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండేళ్ల విరామం  త‌రువాత న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. క‌రోనా కార‌ణంగా షూటింగ్‌ని నిలిపివేశారు.