షూటింగ్ ల నుండి ఐదు రోజుల బ్రేక్ తీసుకోనున్న పవన్.. ఎందుకు?


షూటింగ్ ల నుండి ఐదు రోజుల బ్రేక్ తీసుకోనున్న పవన్.. ఎందుకు?
షూటింగ్ ల నుండి ఐదు రోజుల బ్రేక్ తీసుకోనున్న పవన్.. ఎందుకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను, రాజకీయాలను సమాంతరంగా మ్యానేజ్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఉదయం పూట షూటింగ్ లలో పాల్గొంటూ సాయంత్రం రాజకీయాలు తెలుసుకుంటూ, పార్టీ మీటింగ్స్ పెడుతూ జనాలలో ఉంటున్నారు. ఇప్పటికే పింక్ రీమేక్ కు సంబంధించి తొలి షెడ్యూల్ ను పూర్తి చేసారు. రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. ఈ లోపు క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. నాలుగు రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నాడు. ఈ మధ్య పవన్ క్లీన్ షేవ్ లో దర్శనమిచ్చిన సంగతి తెల్సిందే. ఇది క్రిష్ సినిమాకోసమేనని జనాలకు అర్ధమైంది. అయితే క్రిష్ సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్న పవన్ ప్రస్తుతం ఐదు రోజుల బ్రేక్ ను ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం రాజకీయాలే అని సమాచారం.

ఈ నెల 12-13 తేదీలలో రాజకీయ భేటీ కారణంగా కర్నూల్ వెళ్లనున్నారు పవన్. దాని తర్వాత అటు నుండి అటే అమరావతి వెళ్లి అక్కడి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వారితో సమావేశం కానున్నారు. ఆ తర్వాత 16వ తారీఖున తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణాలు అన్నీ పవన్ స్పెషల్ ఫ్లైట్ లో చేస్తాడని అంటున్నారు. మరి వీటి ఖర్చులను ఎవరి భరిస్తారు అన్నది తెలియలేదు.

పింక్ రీమేక్, క్రిష్ సినిమా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాను కూడా ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతూ నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.