అన్నవరం టార్గెట్ గన్నవరం..??


Pawan Kalyan target gannavaram ?
Pawan Kalyan

అవును మీరు కరెక్టు గానే విన్నారు… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో జరిగే గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నికలలో పోటీ చేస్తారని, అందుకే ఎన్నికల తరువాత ఇంత కాలం మౌనం గా ఉన్న పవన్ ఒక్కసారిగా నిన్న జరిగిన విశాఖ సభతో మళ్ళీ పొలిటికల్ లైమ్ లైట్ లోకి వచ్చారని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటే, ఈ విషయం నిజం అయితే బాగుండని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

గన్నవరం నియోజకవర్గం మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కి కంచు కోట అని మళ్ళీ ఎన్నికలలో ఏ అభ్యర్ధిని పసుపు జెండా ఇచ్చి నిలబెట్టినా, గెలుస్తామన్న ధీమా లో ఉన్న టీడీపీ కి ప్రస్తుతం ఆ నమ్మకం నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. దానికి తగ్గట్లే అధినేత చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు మరి గన్నవరం ఉప ఎన్నికలు జరిగితే ఆ సీటు కోల్పోకుండా, ఉండాలి అంటే, జనసేన పార్టీని బలపరిచి పవన్ కళ్యాణ్ ని గన్నవరం అభ్యర్ధిగా బలపరచడమే ఏకైక మార్గం. జనసేన పార్టీ విషయానికి వస్తే ఎలాగు తెలుగుదేశం పార్టీ తో లోపయీకారీ ఒప్పందం ఉందనే ముద్ర పడింది కాబట్టి, పార్టీ ని 2024 దాకా  క్యాడర్ తో పాటు కాపాడుకోవాలి అంటే ఉన్న మార్గం గన్నవరం ఎన్నికలలో గెలవడమే.

ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ నేరుగా, ఎన్నికలు తరువాత active అయ్యారంటే ఆయన కూడా గన్నవరం ఉప ఎన్నికలను సీరియస్ గా  తీసుకున్నట్లే అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విజయవాడ లో స్థిర నివాసం  ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇది జరిగే సూచనలు ఉన్నాయని అనుకోవచ్చు.

ఒక్కసారి గన్నవరం లో గత ఎన్నికల పోలింగ్ ని పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ కి 1,0,3881 ఓట్లు రాగా, ysrcp కి చెందిన అభ్యర్ధి యార్లగడ్డ వెంకట రావు కి 103043 ఓట్లు వచ్చాయి అంటే మెజారిటీ కేవలం 800 ఓట్లు మాత్రమే. పొత్తులో భాగంగా జనసేన తరపున పోటీకి దిగిన CPI అభ్యర్ధి afsar syed కి 6675 ఓట్లు వచ్చాయి.

మరోవైపు తెలుగుదేశం పార్టీ గన్నవరం ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో వల్లభనేని వంశీ కి దీటైన అభ్యర్ధి ని నిలబెట్టాలని  ఇప్పటిదాకా 10 మందికి పైగా స్క్రూటినీ చేసి అధినేత చంద్రబాబు దగ్గరికి తీసుకుని వెళ్ళినా ఆయన వాళ్ళను ఎవరిని ok చెయ్యలేదని విశ్వసనీయ వర్గ సమాచారం.

ఆదివారం జరిగిన లాంగ్ మార్చ్ లో కూడా, తెలుగుదేశం పార్టీ ఏదో నామమాత్రపు సంఘీభావం తెలపడం కాకుండా, పూర్తి స్థాయిలో తాము గెలిచినా విశాఖలో పవన్ కళ్యాణ్ కి అన్ని రకాలుగా సహయం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది.

మరి 2014 ఎన్నికల తరువాత అధికార పార్టీకి ఎదురు తిరిగి రాజకీయంగా active కావడానికి 4 ఏళ్ళు టైం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2019 లో నాలుగు నెలలకే ప్రశ్నించడం మొదలు పెట్టారు అంటే, ఇది త్వరలో జరగబోయే ఉప ఎన్నికల యుద్దానికి trail అని అందరూ అనుకుంటున్నారు .