జార్జ్ రెడ్డి దర్శకుడిపై పవన్ కన్ను 


జార్జ్ రెడ్డి దర్శకుడిపై పవన్ కన్ను
జార్జ్ రెడ్డి దర్శకుడిపై పవన్ కన్ను

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ సినిమాలు ఇటీవల పక్క ఇండస్ట్రీలను కూడా ఆకర్షిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జార్డ్ రెడ్డి టాపిక్ కూడా సౌత్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటిలో చదువుకున్న జార్జ్ రెడ్డి ఒకప్పుడు ఉద్యమ నాయక లక్షణాలతో అందరిని ఆకర్షించాడు. యూనియన్ స్థాపించి క్యాంపస్ లోనే కొంత మంది రౌడీల చేతిలో హత్యకు గురైన జార్జ్ రెడ్డి కథ ప్రస్తుతం జనరేషన్ ని ఆకర్షిస్తోంది.

గతంలో దళం అనే సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు జీవం రెడ్డి ఆ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇటీవల ట్రైలర్ ని చూసిన జనసేన అధినేత పవన్ దర్శకుడిని కలవడానికి డిసైడ్ అయ్యారట. సినిమా ట్రైలర్ నచ్చడంతో సినిమాను చూడాలని అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. అలాగే దర్శకుడిని అభినందించేందుకు ప్రత్యేకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గనక ఆ సినిమాపై మాట్లాడితే మరింత క్రేజ్ పెరుగుతుంది. మంచి సినిమాలకు గతంలో తన మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.