తన బ్యానర్ లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్న పవన్


తన బ్యానర్ లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్న పవన్
తన బ్యానర్ లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించి ఇప్పటికి ఎన్ని కథనాలు వచ్చాయో లెక్కే లేదు. పవన్ రాజకీయాల్లో వెనకడుగు వేసింది మొదలు తనను తిరిగి సినిమాల్లోకి తీసుకురావాలని నిర్మాతలు చేయని ప్రయత్నమంటూ లేదు. ముఖ్యంగా దిల్ రాజు పవన్ తో ఎలాగైనా సినిమా చేయాలని చెప్పి పింక్ రీమేక్ ను తెరపైకి తేవడంతో పవన్ కూడా ఆలోచనలో పడ్డాడు. ఇక పింక్ రీమేక్ లో పవన్ నటించడానికి ఓకే చెప్పాడు అంటూ వచ్చిన వార్తలతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. పింక్ చిత్ర హక్కులు కలిగి ఉన్న బోణీ కపూర్ కూడా పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు అని అధికారిక కన్ఫర్మేషన్ ను మీడియా సంస్థలకు ఇవ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా పవన్ రీ ఎంట్రీ న్యూస్ లతో మార్మోగిపోయింది. పింక్ రీమేక్ ఒక్కటే కాదు వరసపెట్టి రెండు, మూడు సినిమాలు చేస్తాడు అంటూ కూడా కథనాలు వచ్చాయి. ఇది ఫ్యాన్స్ కు నిజంగా ఆనందాన్ని కలిగించే విషయమే.

అయితే పవన్ కళ్యాణ్ ఈ న్యూస్ వచ్చిన దగ్గరనుండి కొంచెం విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సినిమాల్లోకి రావడానికి ఎస్ చెప్పిన పవన్, ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకుండా రాజకీయాల్లో ఎక్కువ బిజీ అయిపోయాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, లాంగ్ మార్చ్ చేస్తూ, ఢిల్లీ వెళ్లి కూడా చక్రం తిప్పాడు. ఇలా రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పవన్ ఫ్యాన్స్ లో అయోమయం మొదలైంది. సినిమాల్లోకి వస్తున్నా అన్నప్పుడు ఆ తరహా సన్నాహాలు ఏం చెయ్యట్లేదు ఏంటా అని అభిమానులు కూడా కంగారు పడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే పవన్ మీడియాతో మాట్లాడుతూ నేను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానో లేదో తెలీదు కానీ నిర్మాతగా మాత్రం సినిమాలు తీస్తా.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుండి భవిష్యత్తులో వరసగా సినిమాలు వస్తాయి అని ప్రకటన చేసాడు.

ఈ న్యూస్ ను ఎలా రిసీవ్ చేసుకోవాలో పవన్ ఫ్యాన్స్ కు అర్ధం కాలేదు. అంతా కన్ఫర్మ్ అనుకున్నాక ఎందుకు మళ్ళీ తెలీదు అంటున్నాడని కొంత ఆందోళన చెందారు. అయితే నిర్మాతగా అయితే ఉంటాడు కాబట్టి హీరోగా చేసే అవకాశాలనూ కొట్టి పారేయలేం అంటూ పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఏదేమైనా ఒకటైతే స్పష్టం.. పవన్ సినిమాలతో తన అనుబంధాన్ని కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు మరొక న్యూస్ ఏంటంటే పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు.. దాంతో పాటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ను కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయాలన్న కండిషన్ పెట్టాడు పవన్. దీని తర్వాత క్రిష్ తో చేసే చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో వ్యవహరించనున్నాడు. ఇప్పటికే దిల్ రాజు పింక్ రీమేక్ ను నిర్మిస్తుండగా బోణీ కపూర్ ఒక నిర్మాతగా ఉంటాడు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ కు ఇన్వాల్వ్ అవుతాను అంటే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి.