పవన్ కళ్యాణ్ కు ఈజీగా ఏం ఉండబోదు!పవన్ కళ్యాణ్ కు ఈజీగా ఏం ఉండబోదు!
పవన్ కళ్యాణ్ కు ఈజీగా ఏం ఉండబోదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కొన్ని నెలల క్రితం కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. పవన్ కు ఈజీగా ఉండడానికి కోర్ట్ రూమ్ డ్రామా పింక్ రీమేక్ ను ఎంచుకుని అతని ముందు ప్రపోజల్ పెట్టి దిల్ రాజు ఓకే చేయించుకున్నాడు. కేవలం నెల రోజుల కాల్ షీట్స్ అడిగి భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసి పవన్ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. అయితే అందరూ అనుకున్నట్లు పవన్ కు ఈ సినిమా అంత ఈజీగా ఏం ఉండబోవట్లేదు. మిగతా సినిమాలకు కష్టపడిన విధంగానే దీనికి కూడా కష్టబడుతున్నాడు. ఎందుకంటే ఇది పింక్ రీమేక్ అనేకంటే తమిళంలో అజిత్ చేసిన నెర్కొండ పర్వాయ్ చిత్రానికి రీమేక్ అనడం సమంజసం. ఆ సినిమాలో అజిత్ కు పెట్టినట్లుగా ఇందులో కూడా ఒక పార్క్ ఫైట్ సీన్ ను పెట్టబోతున్నారు.

ఆ సినిమాకు అదనంగా క్లైమాక్స్ కు ముందు మరో ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అలాగే పింక్ లో లేని విధంగా ఈ చిత్రంలో పవన్ కు ఒక హీరోయిన్ కూడా ఉంటుంది. అతిథి రోల్ కు ఎక్కువ, హీరోయిన్ రోల్ కు తక్కువ అనేలా స్క్రీన్ స్పేస్ ఉండే ఆ పాత్రకు హీరోయిన్ ఎంపిక గురించి వివరాలు అందాల్సి ఉంది. పూజ హెగ్డేను అనుకుంటున్నారు అన్న వార్తలు వచ్చాయి కానీ దానిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ మరో నెల రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే పవన్ పాల్గొనే షెడ్యూల్ లో మొదట కోర్ట్ రూమ్ సీన్స్ ను షూట్ చేసి తర్వాత ఈ ఫైట్ సీక్వెన్స్, సాంగ్స్ తీయాలి అని అనుకున్నారు కానీ ఇప్పుడు ప్లానింగ్ మారినట్లుగా తెలుస్తోంది. పవన్ పాల్గొనే మొదటి షెడ్యూల్ లోనే ఫైట్ సీక్వెన్స్ తో మొదలుపెట్టబోతున్నారు. ఆ తర్వాత హీరోయిన్ తో పవన్ కాంబినేషన్ సీన్స్ తీసి మార్చ్ నుండి కోర్ట్ రూమ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది.