ప‌వ‌ర్‌స్టార్ కోసం మ‌ల‌యాళ బ్యూటీ?

ప‌వ‌ర్‌స్టార్ కోసం మ‌ల‌యాళ బ్యూటీ?
ప‌వ‌ర్‌స్టార్ కోసం మ‌ల‌యాళ బ్యూటీ?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్‌ల తొలి క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం `గ‌బ్బ‌ర్‌సింగ్`. బండ్ల గ‌ణేష్ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి  ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెరీర్‌కి మ‌రింత బూస్ట‌ప్‌నిచ్చింది. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో వున్న ప‌వ‌న్ ఈ సినిమాతో మ‌ళ్లీ విజ‌యాల బాట‌ప‌ట్టారు.  ఈ మ‌యూవీ విడుద‌లై ఈ నెల 11తో 8 ఏళ్లు పూర్త‌య్యాయి. ఇదిలా వుంటే మ‌రోసారి ఈ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతోంది.

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న`వ‌‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో 27వ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. 28వ చిత్రాన్ని హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు. మైత్రీమూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం రూపొంద‌నుంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తాజాగా వెల్ల‌డించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా మ‌ల‌యాళీ భామ మాన‌స రాధాకృష్ణ‌న్‌ని ఎంపిక చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఫ్రెష్ ఫేస్ అయితేనే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ భావించి ఆమెని ఎంపిక చేయాల‌నుకుంటున్నార‌ట‌.